యూపీ(UP)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధుర (Madhura) లో మొత్తం ఏడు దుకాణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మోటర్ సైకిల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
దీపావళి సందర్బంగా గోపాల్ బాగ్ లోని రయా ప్రాంతంలో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగినట్టు ఎస్ఐ అజయ్ కిషోర్ తెలిపారు. చూస్తుండగానే మిగిలిన దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వుంటాయని అంచనా వేస్తున్నామన్నారు.
ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. మిగతా వారిని మదురా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ కు కూడా గాయాలయ్యాయన్నారు.
దుకాణానికి సమీపంలో ఉన్న 10 మోటార్ సైకిల్స్ కూడా పూర్తిగా కాలిపోయాయన్నారు. ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.