Telugu News » KTR : కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆగమే!

KTR : కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆగమే!

ఆనాటి కాంగ్రెస్ దరిద్రం మళ్లీ కావాలా? అంటూ ఫైరయ్యారు. ‘‘200 ఇవ్వలేని కాంగ్రెస్ 4 వేలు ఇస్తుందా?. ఆగం కావొద్దు. కాంగ్రెస్ వస్తే ఆగం అవుతుంది. 30న జరిగితే ఇద్దరి మధ్య కొట్లాట కాదు. ఇది ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పంచాయితీ’’ అని తెలిపారు.

by admin

– కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం
– కేసీఆర్ హయాంలో సుభిక్షం
– 11 సార్లు ఛాన్సిస్తే కాంగ్రెస్ చేసిందేంటి?
– 200 ఇవ్వడం చేతకాని పార్టీ 4వేలు ఇస్తుందా?
– హస్తం దరిద్రం మళ్లీ ఎందుకు?
– ఆలోచన చేయండి.. ఆగం కావొద్దు
– వేములవాడలో కేటీఆర్ పర్యటన

కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు మంత్రి కేటీఆర్ (KTR). వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలోని కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని రేవంత్‌ రెడ్డి అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ (Congress) కు 11 ఛాన్సులు ఇచ్చారని.. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక ఛాన్సు అడుగుతోందని ఎద్దేవ చేశారు. హస్తం నేతల మాటలు నమ్మొద్దని తెలిపారు. 65 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ చేయని పనులను తాము తొమ్మిదన్నరేళ్లలో పూర్తి చేసి చూపించామని వివరించారు.

ktr-road-show-at-rudrangi

2014లో తెలంగాణ ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు కేటీఆర్. ఆనాడు 200 పెన్షన్ తీసుకుంటే.. ఇప్పుడు 2వేలు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బీడీలు చుట్టే వాళ్లను పట్టించుకున్నారా? అని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో వారికి 2 వేల పెన్షన్ ఇస్తున్నట్టు తెలిపారు. పేదోళ్లను కడుపునపెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీ పెంచిన సిలిండర్‌ ధర తగ్గించే బాధ్యత బీఆర్ఎస్‌ తీసుకుంటుందని చెప్పారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.3వేలు ఇవ్వనున్నట్లు కేటీఆర్ వివరించారు.

ప్రజా ఆశీర్వాద సభ తర్వాత వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఎంతో గోస పడ్డామన్నారు. ఆనాడు రైతులు ప్రతీరోజు జాగారం చేసేవాళ్లని అన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ దరిద్రం మళ్లీ కావాలా? అంటూ ఫైరయ్యారు. ‘‘200 ఇవ్వలేని కాంగ్రెస్ 4 వేలు ఇస్తుందా?. ఆగం కావొద్దు. కాంగ్రెస్ వస్తే ఆగం అవుతుంది. 30న జరిగితే ఇద్దరి మధ్య కొట్లాట కాదు. ఇది ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పంచాయితీ’’ అని తెలిపారు.

తొమ్మిదిన్నరేళ్లలో ఏం చేశామో ప్రజలు గమనించాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. 65 ఏళ్లు చావగొట్టారని మండిపడ్డారు. అన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ కు రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? 24 గంటల కరెంట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ఏమివ్వని వాళ్లకు మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని నిలదీశారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో ప్రతీ మహిలకు నెలకు 3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

You may also like

Leave a Comment