Telugu News » Purnesh Modi : రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేతకు కీలక పదవి

Purnesh Modi : రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేతకు కీలక పదవి

దాద్రా నగర్ హవేలీ- డయ్యూ-డామన్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల పరిశీలకునిగా ఆయన్ని నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

by Ramu

రాహుల్ గాంధీ (Rahul Gandhi )పై పరువు నష్టం (Defamation) దావా వేసిన బీజేపీ నేత, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ (Purnesh MOdi)కి కీలక పదవిని ఆ పార్టీ కట్టబెట్టింది. దాద్రా నగర్ హవేలీ- డయ్యూ-డామన్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల పరిశీలకునిగా ఆయన్ని నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం పూర్ణేశ్ మోడీ పశ్చిమ సూరత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో కర్ణాటకలోని కొల్లార్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటి పేరు మోడీ అని ఎందుకు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం రేగింది. మోడీ అనేది ఒక కులం అని, తమ కులాన్ని అవమానించారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిర సూరత్ కోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఎంపీ హోదాలో ఉన్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్దరించారు.

You may also like

Leave a Comment