అయోధ్య (Ayodhya )లో రామ్ లల్లా ( Ram Lalla) విగ్రహానికి జనవరి 22న ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రతిష్టాపనకు సమయం దగ్గరపడుతుండటంతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్మాణ కమిటీ ప్రయత్నిస్తోంది. ఆలయ నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులను వచ్చే నెల 15లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిచామన్నారు. ఇది ఇలా వుంటే వచ్చే ఏడాది జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ వినోద్ మెహతా వెల్లడించారు.
ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తమపై చాలా ఒత్తిడి ఉందని తెలిపారు. ఇప్పటికే ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. స్తంభాలపైన శిల్పకళాకృతులను సుందరంగా చెక్కుతున్నారన్నారు. నృత్య మండపం పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల నాటిని గ్రౌండ్ ఫ్లోర్ పనులను పూర్తిచేస్తామన్నారు. అదే సమయంలో రంగమండపాన్ని కూడా వచ్చే నెల నాటికి రెడీ చేస్తామన్నారు.
ఆలయం మొత్తాన్ని పసుపు రంగు విద్యుత్ దీపాలతో అలకంరించనున్నట్టు చెప్పారు. రెండు రకాల విద్యుత్ ధీపాలను ఇందులో ఉపయోగిస్తున్నామని వివరించారు.
రెండు రకాల లైట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పైకప్పు పై లైటింగ్ అమర్చే ప్రక్రియ పూర్తయిందన్నారు. వాల్వాస్ లైట్ల కాంతి నేరుగా స్తంభాలపై చెక్కిన శిల్పాలపై పడేలా అమరుస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ దీపాల అలంకరణ పనులన్నీ పూర్తయితే రామ్ లల్లా ఆలయం పూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతుందన్నారు.