Telugu News » CM KCR : ఆనాడు ఎలా ఉన్నాం.. ఇప్పుడు ఎలా ఉన్నాం..!

CM KCR : ఆనాడు ఎలా ఉన్నాం.. ఇప్పుడు ఎలా ఉన్నాం..!

ఓటు వేసే ముందు అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర పరిశీలించాలని సూచించారు సీఎం. ప్రజల చేతుల్లో ఉండే ఏకైక వజ్రాయుధం ఓటని.. అది వారి తలరాతను మారుస్తుందని స్పష్టం చేశారు.

by admin
cm-kcr-participating-in-praja-ashirvada-sabha-at-tandur

– ఆలోచించి ఓటెయ్యండి
– కంగారు పడితే ఐదేళ్లు గోసపడతాం
– ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది?
– ఇప్పుడు మా పాలనలో ఏం జరిగింది?
– అన్నీ పోల్చి చూసుకొని ఓటెయ్యండి
– ప్రజలకు కేసీఆర్ సూచన

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే మళ్లీ దళారీలు రాజ్యమేలుతారన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). వికారాబాద్​ జిల్లా తాండూరులో బీఆర్​ఎస్ (BRS)​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా కర్ణాటక పరిస్థితులే ఉంటాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పాటు తర్వాత అభివృద్ధిపై మేధావులతో చర్చించామని తెలిపారు. 3,500 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకున్నామని వివరించారు.

cm-kcr-participating-in-praja-ashirvada-sabha-at-tandur

55 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఏం జ‌రిగింది.. ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ఏం జ‌రిగిందనేది పోల్చి చూడాలన్నారు కేసీఆర్. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టిందే కాంగ్రెస్ అని.. కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వ‌లేదని మండిపడ్డారు. హస్తం పాలనలో స్థానిక జనం కాగ్నా న‌ది దగ్గర గుంత‌లు తీసి నీళ్లు వ‌డ‌ క‌ట్టుకొని తాగేవాళ్లని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మిష‌న్ భ‌గీర‌థ‌తో ప్ర‌తి తండాలో, చిన్న ఊరులో కూడా ప‌రిశుద్ధ‌మైన నీరును స‌ర‌ఫ‌రా అవుతోందని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక పేద‌ల సంక్షేమాన్ని ముందు తీసుకున్నామని.. రూ.200 ఉన్న‌ పెన్ష‌న్‌ ను రూ.2 వేలు చేశామన్నారు. కంటి వెలుగు ద్వారా కండ్ల‌ద్దాలు పంపిణీ చేశామని.. గ‌ర్భిణుల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహ‌నాలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ వంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామని వివరించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ నేతల కుట్రలను రోహిత్ రెడ్డి అడ్డుకున్నారన్నారు.

ఓటు వేసే ముందు అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర పరిశీలించాలని సూచించారు సీఎం. ప్రజల చేతుల్లో ఉండే ఏకైక వజ్రాయుధం ఓటని.. అది వారి తలరాతను మారుస్తుందని స్పష్టం చేశారు. తమ ఓటును సక్రమంగా ఉపయోగించుకుంటే ఐదేళ్ల భవిష్యత్‌ బాగుంటుందని చెప్పారు. రైతుబంధును పుట్టించిందే తానని.. అదృష్టం బాగాలేక రైతు ఎవ‌రైనా చ‌నిపోతే వారం లోపే 5 ల‌క్ష‌ల బీమా ఇస్తున్నామన్నారు. 7,500 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నామని… ప్ర‌భుత్వానికి న‌ష్టం వ‌చ్చిన‌ప్ప‌టికీ రైతులు బాగుండాల‌ని మ‌ద్ధ‌తు ధ‌ర‌కు ఇస్తున్నామని వివరించారు సీఎం కేసీఆర్.

You may also like

Leave a Comment