Telugu News » smallest Polling Booth : ఆ గ్రామంలో ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్….!

smallest Polling Booth : ఆ గ్రామంలో ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్….!

రాష్ట్ర వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

by Ramu
rajasthan elections 2023 ec arrenges polling booth for one family in rajasthan

రాజస్థాన్‌ (Rajasthan)లో పోలింగ్ (Polling) ప్రశాంతంగా జరుగుతోంది. 199 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా బారన్ ప్రాంతంలో 12.97 శాతం, దోలాపూర్‌లో 12.66 శాతం ఓటింగ్ నమోదైన్నట్టు వెల్లడించారు.

ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో కేవలం ఒక కుటుంబం కోసం పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. పాక్ సరిహద్దుల్లోని బార్మర్ జిల్లా పార్క్ గ్రామంలో 35 మంది కోసం ఓ పోలింగ్ బూత్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ 35 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. గతంలో పోలింగ్ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు.

గతంలో ఈ గ్రామస్తులు ఓటు వేసేందుకు 20 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇది ఎడారి ప్రాంతం కావడంతో ఓటు హక్కు కోసం ఒంటెలపై లేదా కాలినడకన 20 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆ ప్రయాణం మహిళలకు, వృద్ధులకు సవాలుగా మారింది. కానీ ఈ ఏడాది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వారికి ఇబ్బందులు తొలగిపోయాయి.

ఈ ఏడాది ఆ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఆ గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఆ గ్రామ ఓటర్లు సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ గ్రామంలో 18 మంది పురుషులు, 17 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇది ఇలా వుంటే ఈ ఎన్నికల్లో విజయంపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

You may also like

Leave a Comment