Telugu News » Srinivasa Ramanujan : గణిత మేధావి… శ్రీనివాస రామానుజన్…..!

Srinivasa Ramanujan : గణిత మేధావి… శ్రీనివాస రామానుజన్…..!

15 ఏండ్ల వయసులోనే అతి కఠినమైన జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’పుసక్తంలోని పలు సిద్దాంతాలు, సూత్రాలకు తనదైన రీతిలో సాధనలు చూపించారు.

by Ramu

శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan)…. గణిత ప్రపంచంలో భారత కీర్తిని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప గణిత శాస్త్రవేత్త (Mathematician).15 ఏండ్ల వయసులోనే అతి కఠినమైన జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’పుసక్తంలోని పలు సిద్దాంతాలు, సూత్రాలకు తనదైన రీతిలో సాధనలు చూపించారు. ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారంటేనే ఆయన మేధస్సు గురించి మనకు తెలిసిపోతుంది.

1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. తండ్రి కే శ్రీనివాస అయ్యంగార్, తల్లి కోమలటమ్మాళ్. చిన్నతనం నుంచే గణితంలో ఆయన ఆసక్తి కనబరిచే వారు. చిన్నతనంలోనే ఆయిలర్ సూత్రాలు, త్రికోణమితికి సంబంధించిన అనే చిక్కు ప్రశ్నలను అవలీలగా సాధించి అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసేవారు. కాలేజీ స్థాయికి వచ్చే వరకు గణితం పట్ల ఆయనకు మక్కువ పెరిగింది.

కళాశాలలో చదువుతున్న సమయంలో గణితంపై శ్రద్ద చూపుతూ మిగిలిన సబ్జెక్టులను నిర్లక్ష్యం చేశారు. దీంతో పరీక్ష తప్పారు. జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’పుస్తకంలోని పలు సిద్దాంతాలను ఆయన సాధంచి చూపించారు. మహా, మహా మేధావులు, ప్రొఫెసర్లకు కూడా సరిగా అర్థం కాని సిద్దాంతాలు, సూత్రాలను ఆయన సాధించి చూపించారు.

రామానుజానికి ఎలాంటి డిగ్రీ లేకున్నప్పటికీ అప్పట్లో మద్రాసు విశ్వ విద్యాలయం ఆయనకు రూ. 75 ఫెలోషిప్ గా ఇచ్చింది. ఆ తర్వాత రామానుజం పరిశోధనల గురించి వాకర్ అనే గణిత శాస్త్రవేత్త కేంబ్రిడ్జికి పంపించారు. రామానుజం ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జి వర్శిటీ ప్రొఫెసర్లు ఆయన్ని అక్కడకు ఆహ్వానించారు. పరిశోధనల్లో మునిగిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో 33 ఏండ్లకే మరణించారు. తన చివరి రోజుల్లో 1729 సంఖ్య విశిష్టతను వివరించాడు. దీంతో దాన్ని రామానుజం సంఖ్య గుర్తించారు.

You may also like

Leave a Comment