కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి షాక్ తగిలింది. అమిత్ షా (Amit Shah)పై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. 2018 బెంగళూరులో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన కేసులో డిసెంబర్ 16న న్యాయ స్థానం ఎదుట విచారణకు హాజరు కావాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
2018లో బెంగళూరులో అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత విజయ్ మిశ్ర అన్నారు. అమిత్ షా ఒక హంతకుడు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారని తెలిపారు. ఆ సమయంలో తాను బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్నారు.
వెంటనే రాహుల్ గాంధీపై న్యాయస్థానంలో పిటిషన్ వేశానన్నారు. ఐదేండ్లుగా ఏ కేసుపై విచారణ జరుగుతోందన్నారు. ఈ కేసులో విజయ్ మిశ్రా తరఫున ప్రముఖ న్యాయవాది సంతోష్ కుమార్ పాండే వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో దోషిగా తేలితే రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
2018లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో ఓ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమిత్ షాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో 4 అగస్టు 2018న రాహుల్ గాంధీపై విజయ్ మిశ్రా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి న్యాయస్థానం నోటీసులు పంపింది.