ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా టన్నెల్ (Tunnel)లో రెస్య్యూ ఆపరేషన్ (Rescue Operation) 17వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆగర్ మెషిన్, మ్యానువల్ డ్రిల్లింగ్ కలిపి 52 మీటర్ల వరకు టన్నెల్ ను తొలిచామని అధికారులు తెలిపారు. టన్నెల్‌లో 57 మీటర్ల దూరంలో కార్మికులు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.
ప్రస్తుతం టన్నెల్‌లోకి పైపును పంపించి కార్మికులను రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రిల్లింగ్ కొనసాగుతోందని, ప్రస్తుతం ఉన్న పైపు మరో రెండు మీట్ల వరకు ముందుకు వెళుతుందన్నారు. దీంతో 54 మీటర్లకు పైపు సరిపోతుందన్నారు. ఆ తర్వాత మరో మూడు మీటర్ల దూరం ఉంటుందన్నారు.
ఆ మూడు మీటర్ల కోసం మరో పైపును ఉపయోగిస్తామన్నారు. ర్యాట్ హోల్ మైనింగ్‌కు చెందిన 24 మంది సిబ్బందితో మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. దీనిపై ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ మాట్లాడారు. మరో ఐదు మీటర్లు డ్లిల్లింగ్ చేస్తే కార్మికులను చేరుకుంటామన్నారు.
గత రాత్రి తమకు డ్రిల్లింగ్‌లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదన్నారు. డ్లిల్తింగ్ అంతా సాఫీగా సాగిందన్నారు. పాజిటివ్ వాతావరణం కనిపిస్తోందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న టన్నెల్ వద్దకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ రోజు వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు.