Telugu News » తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారు.

by admin
Arrangements for Telangana elections have been completed

తెలంగాణ( Telangana)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling) ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ 80.23 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 39.97 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరో 72 గంటల్లో పార్టీల భవితవ్యం తేలనుంది. పోలింగ్ ముగిసన నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయాలను వెల్లడిస్తున్నాయి. దీంతో అందరూ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.

రాజనీతి స్ట్రాటజీస్ (రాష్ట్ర)

బీఆర్ఎస్- 45 నుంచి 50 స్థానాలు

కాంగ్రెస్-56 నుంచి 61 స్థానాలు

బీజేపీ 10 నుంచి 12 స్థానాలు

ఎంఐఎం-7 స్థానాలు
————————-
ఆరా ఎగ్జిట్ పోల్స్ :

బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు

కాంగ్రెస్-58 నుంచి 67 స్థానాలు

బీజేపీ- 5 నుంచి 12 స్థానాలు

ఇతరులు-7 నుంచి 9 స్థానాలు
—————————-
సీఎన్ఎన్-ఐబీఎన్

బీఆర్ఎస్- 48

కాంగ్రెస్- 56

బీజేపీ -10

ఇతరులు- 5 స్థానాలు
————————–
సీ-ప్యాక్‌
కాంగ్రెస్‌ : 65
బీఆర్‌ఎస్‌ : 41
బీజేపీ : 04
ఇతరులు : 09
—————–
చాణక్య స్ట్రాటజీస్

కాంగ్రెస్ : 67-78
బీఆర్ఎస్ : 22-30
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00
——————–
న్యూస్‌18 సర్వే
బీఆర్‌ఎస్‌: 48
కాంగ్రెస్‌: 56
బీజేపీ: 0
ఎంఐఎం: 5
ఇతరులు: 0
—————-
పొలిటికల్‌ గ్రాఫ్‌
బీఆర్‌ఎస్‌: 68
కాంగ్రెస్‌: 38
బీజేపీ: 5
ఎంఐఎం-7
ఇతరులు-1
—————
పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
——————
పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌
కాంగ్రెస్‌: 65-68
బీఆర్ఎస్‌: 35-40
బీజేపీ: 7-10
ఇతరులు: 6-9
—————-
థర్డ్‌ విజన్‌ సర్వే
బీఆర్‌ఎస్‌ 60-68
కాంగ్రెస్‌ 33-40
బీజేపీ 1-4
ఎంఐఎం 5-7
ఇతరులు- 0-1
—————-
జనంసాక్షి
బీఆర్‌ఎస్‌: 26-37
కాంగ్రెస్‌ : 66-77
బీజేపీ: 4-9
ఎంఐఎం: 6-7
ఇతరులు: 0-1
———————
పార్థదాస్‌ సర్వే
బీఆర్‌ఎస్‌: 40
కాంగ్రెస్‌: 68
బీజేపీ: 4
ఎంఐఎం: 6
ఇతరులు: 1

పోలింగ్ బూత్‌ లలో బారులు తీరిన ఓటర్లు
ఉ. 7 గంటల నుండి మ. 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్
అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు
అత్యల్పంగా హైదరాబాద్ లో 32 శాతం పోలింగ్

ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కంప్లైంట్స్ వచ్చాయి. డీఈఓ రిపోర్ట్ ఆధారంగా కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆయా డీఈవోలకు పంపించాం. చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మార్చడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరగాలి. నాగార్జున సాగర్ అంశాన్ని పోలీసులు చూసుకుంటారు. దీనిపై రాజకీయ నేతలు తొందరపడవద్దు. తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దు- వికాస్ రాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలను సవరించిన ఈసీ
సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు అనుమతి

పాతబస్తీలో ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య ఘర్షణ
ఎంబీటీ అభ్యర్థి ఖలీద్ ఖాన్, ఎంఐఎం నేత యాసిర్ అరెస్ట్

ఎల్బీనగర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
పోలీసుల తీరుపై మధు యాష్కీ ఆగ్రహం
పోలింగ్ కేంద్రం బయట కూడా మాట్లాడొద్దనడంపై అభ్యంతరం

తెలంగాణలో పలు చోట్ల టెన్షన్ వాతావారణం
డీజీపీతో మాట్లాడిన సీఈవో వికాస్ రాజ్
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు
జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో ఘర్షణలు

సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు

ప్రశాంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్‌

హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్
4.57 శాతం పోలింగ్ నమోదు
అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్
అత్యధికంగా రాజేంద్రనగర్‌ లో 15 శాతం పోలింగ్ నమోదు

మేడిపల్లిలో ధర్మపురి అరవింద్ ను అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు
అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నం

వికారాబాద్ జిల్లా తాండూరులోని పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
జనసేన అభ్యర్తి శంకర్ గౌడ్ తో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం

యాదాద్రి దాచారంలో పోలింగ్ కేంద్రం దగ్గర తేనెటీగల దాడి
ఓ వృద్ధురాలికి గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా 8.38 శాతం పోలింగ్ నమోదు
తొలి రెండు గంటల్లో సాధారణ పోలింగ్ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల సంఘం

రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం వట్టేపల్లిలోని సెంట్ ఫాయజ్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఓటు వేయడం మీ హక్కు.. అది మీ అతిపెద్ద బాధ్యత- ప్రియాంక గాంధీ

బంజారాహిల్స్ నంది నగర్ కమ్యూనిటీ హాల్ లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని వినతి

నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ లో ఉద్రిక్తత
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేసిన సీఐ

జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ దగ్గరే ఉండడంపై కాంగ్రెస్ అభ్యంతరం
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేటలో ఓటు బహిష్కరణ
పోలింగ్ లో పాల్గొనని గ్రామస్తులు
తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని బహిష్కరణ

ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న కవిత
ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

బీఆర్ఎస్ కండువాతో ఓటు వేసిన ఇంద్రకరణ్ రెడ్డి
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ప్రతిపక్షాల ఆగ్రహం

మణికొండలో ఓటు హక్కును వినియోగించుకున్న విక్టరీ వెంకటేష్
కొడంగల్ లో ఓటు వేసిన రేవంత్ రెడ్డి
ఓటర్లు అందరూ ఓటు వేయాలని కోరిన రేవంత్ రెడ్డి

రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలి. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి- నరేంద్ర మోడీ, భారత ప్రధాని

జూబ్లీహిల్స్ క్లబ్ లో భార్యతో కలిసి ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి

అంబర్ పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి
ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని వినతి

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ లో ఎమ్మెల్యే రఘునందన్ ఓటు వేశారు
బోయినపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మల్లారెడ్డి

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో ఓటు వేసిన కీరవాణి
జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ 153లో మొరాయించిన ఈవీఎం

మీ ఓటు ఐదేళ్ల ప్రగతిని నిర్ణయిస్తుంది. సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటూ కీలకమే. అర్హులైన ఓటర్లు అందరూ ఓటు వేయాలి. మీ కుటుంబం, స్నేహితులు కూడా ఓటు వేసేలా చూడండి- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్
జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఓటు వేసిన ఎర్రబెల్లి దయాకర్

బంజారాహిల్స్ లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు
మెదక్ జిల్లా కౌడిపల్లిలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓటు వేశారు

పోలింగ్ నేపథ్యంలో కేటీఆర్ ప్రత్యేక ట్వీట్ చేశారు.

  • ‘‘మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి
  • మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి
  • మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి
  • మీ ఓటు.. వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి
  • మీ ఓటు.. మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి
  • మీ ఓటు.. యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి
  • మీ ఓటు.. సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలి
  • మీ ఓటు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగురవేయాలి
  • మీ ఓటు.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి
  • మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి
  • అందుకే.. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. అందరూ రండి..!
  • ప్రతి ఒక్కరూ “ముచ్చటగా…” ఓటు హక్కును వినియోగించుకొండి..!! జై తెలంగాణ, జై భారత్’’ అని ట్వీట్ చేశారు కేటీఆర్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఓటేసిన అల్లు అర్జున్
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో ఓటేసిన నటుడు సుమంత్

ఆదిలాబాద్ లోని డైట్ కళాశాలలో 262, 261,263 పొలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు
మాక్ పొలింగ్ సమయంలో ఆగిన ఈవీఎంలు
ఆలస్యం అవుతున్న పోలింగ్
రాజేంద్రనగర్ ఎర్రబోడ 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్
ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మొదటి ఓటును వేసిన తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు ఓటు వేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికలు
నక్సల్స్ ప్రభావిత స్థానాల్లో సా. 4 గంటల వరకే ఎన్నిక
ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు

 

రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్

ఉదయం 5.45 నిమిషాలకు మాక్ పోలింగ్ ప్రారంభం

ఈవీఎంల పని తీరును పరిశీలించిన ఎన్నికల సిబ్బంది

కొన్ని కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండానే మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి

 

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది

పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్లు

27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు

You may also like

Leave a Comment