Telugu News » COP 28 : కాప్-28లో కీలక పరిణామం… ఆ ఒప్పందంపై సంతకాలకు చైనా, భారత్ దూరం…!

COP 28 : కాప్-28లో కీలక పరిణామం… ఆ ఒప్పందంపై సంతకాలకు చైనా, భారత్ దూరం…!

2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని ( global renewable energy) మూడు రెట్లు పెంచుతామని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.

by Ramu
India China skip signing renewable power pledge at COP28 118 countries sign

దుబాయ్‌లో జరుగుతున్న కాప్-28 (COP-28) వాతావరణ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని ( global renewable energy) మూడు రెట్లు పెంచుతామని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ మేరకు రూపొందించిన ప్రతిజ్ఞ పై సంతకాలకు భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి. మొత్తం 118 దేశాలు ఈ ప్రతిజ్ఞపై సంతకాలు చేశాయి.

India China skip signing renewable power pledge at COP28 118 countries sign

ప్రపంచ దేశాలు శక్తి ఉత్పాదన విషయంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని పెంచాలనేది ఈ తీర్మానం లక్ష్యం. దీంతో పాటు 2030 నాటికి ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్య మెరుగుదల రేటును 4 శాతానికి రెట్టింపు చేయాలని ఈ సమావేశంలో ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.

జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియాతో పాటు పలు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకానికి దూరంగా ఉన్నప్పటికీ ఒప్పంద లక్ష్యాలను భారత్, చైనాలు సూచన ప్రాయంగా అంగీకారం తెలిపాయి. మొత్తం 198 దేశాలకు సంబంధించిన లక్ష మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అంతకు ముందు ప్రధాని మోడీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే కాప్-33 సదస్సును భారత్‌లో నిర్వహించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను ప్రపంచానికి భారత్ చూపించిందన్నారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్ లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ అని తెలిపారు.

You may also like

Leave a Comment