మిజోరాం (Mizoram)లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ట్రెండ్ ప్రకారం అధికార మిజో నేషనల్ ఫ్రెంట్ (MNF),జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM) పార్టీల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 21 సీట్ల మెజారిటీ అవసరం ఉంది. ఎర్లిట్రెండ్ ప్రకారం ఎంఎన్ఎఫ్ 8, విపక్ష జెడ్పీఎం 28 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.
టుయిచాంగ్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం టౌన్లూయా ఓటమి పాలయ్యారు. జెడ్పీఎం అభ్యర్థి చౌఅన్వ చేతిలో పరాజయం పాలయ్యారు. టౌన్లూయాకు 6,079 ఓట్లు రాగా, చౌఅన్వకు 6988 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఐజ్వల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం జోరంతంగా వెనుకంజలో ఉన్నారు. జోరతంగాపై జెడ్పీఎం అభ్యర్థి లాత్ తంగా 640 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
జోరతంగాకు 3074 ఓట్లు రాగా, లాల్ తంగాకు 3714 వచ్చాయి. జెడ్పీఎం సీఎం అభ్యర్థి లాల్దూహోమా 1992 ఓట్ల ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. ఇక కాంగ్రెస్ రెండు స్థానాల్లో లీడ్‌లో ఉంది. తోరాంగ్లో కాంగ్రెస్ అభ్యర్థి జోడింట్లుంగా రాల్టే, పాలక్ నుంచి ఐపీ జూనియర్ లీడ్‌లో ఉన్నారు. ఈ ఫలితాలను తనకు ఆశ్చర్యం కలిగించలేదని లాల్దూ హోమా వెల్లడించారు.
ఈ ఫలితాలను తాము ముందే ఊహించానన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోందన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాక దీనిపై స్పందిస్తానన్నారు. ఇక బీజేపీ మూడు స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. తుయిచాంగ్లో బీజేపీకి చెందిన దుర్జ్య ధన్ చక్మా 585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.రెండో రౌండ్ కౌంటింగ్ ముగిశాక సౌత్ టుయిపుయ్లో జేజే లాల్పెఖ్లూవా 254 ఓట్లతో ముందంజలో ఉన్నారు.