Telugu News » KCR : ఆస్పత్రిలో కేసీఆర్.. స్పందించిన ప్రధాని మోడీ

KCR : ఆస్పత్రిలో కేసీఆర్.. స్పందించిన ప్రధాని మోడీ

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్‌ కు సర్జరీ చేయకుంటే రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. సర్జరీ చేస్తే మాత్రం కొద్ది రోజులు ఆస్పత్రిలోనే చికిత్ర పొందనున్నారు.

by admin
pm-modi-prays-for-kcrs-speedy-recovery

ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ (KCR).. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరైనా అక్కడకే వెళ్లి కలుస్తున్నారు. అయితే.. కేసీఆర్ తాజాగా కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆయనకు గాయం కావడంతో హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో ఇతర నాయకులు స్పందిస్తున్నారు.

pm-modi-prays-for-kcrs-speedy-recovery

కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్పందించారు. కేసీఆర్‌ కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడినట్టు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఇటు, కేసీఆర్ కుమార్తె కవిత (Kavitha) కూడా ట్విట్టర్ లో స్పందించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో స్పెషలిస్టుల సంరక్షణలో ఉన్నారని అన్నారు. నాన్న త్వరలో పూర్తిగా కోలుకుంటారని, అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

గురువారం అర్ధరాత్రి దాటాక కేసీఆర్ తన ఫాంహౌస్‌ లో జారి పడిపోయారు. ఎడమ కాలుకు రెండు చోట్ల తుంటి గాయమైందని వైద్యులు చెప్పారు. దీంతో సోమాజిగూడలోని యశోదకు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్‌ కు సర్జరీ చేయకుంటే రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. సర్జరీ చేస్తే మాత్రం కొద్ది రోజులు ఆస్పత్రిలోనే చికిత్ర పొందనున్నారు.

You may also like

Leave a Comment