Telugu News » Hyderabad: రౌడీషీటర్ వద్ద రూ.100 కోట్లు.. ఈడీకి అప్పగించిన పోలీసులు..!

Hyderabad: రౌడీషీటర్ వద్ద రూ.100 కోట్లు.. ఈడీకి అప్పగించిన పోలీసులు..!

అక్టోబర్ 26న హబీబ్ నగర్ పోలీసులు ఖైజర్‌పై కేసు నమోదు చేసి పట్టుకున్నారు. అనేక క్రిమినల్ కేసుల్లో అతడి ప్రమేయం ఉందని, ఓ ముఠాను కూడా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో పీడీ యాక్ట్ కింద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

by Mano
Hyderabad: Rs. 100 crores from rowdy sheeter.. Police handed over to ED..!

హైదరాబాద్‌(Hyderabad)లోని హబీబ్‌నగర్ రౌడీషీటర్ ఖైజర్ ‘పహెల్వాన్’పై ఎన్ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలైంది. అతడిపై విచారణ ప్రారంభించాలని హైదరాబాద్ పోలీసులు ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ED) లేఖ రాశారు. ఈ కేసును ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ఫైల్ చేసింది.

Hyderabad: Rs. 100 crores from rowdy sheeter.. Police handed over to ED..!

అక్టోబర్ 26న హబీబ్ నగర్ పోలీసులు ఖైజర్‌పై కేసు నమోదు చేసి పట్టుకున్నారు. అనేక క్రిమినల్ కేసుల్లో అతడి ప్రమేయం ఉందని, ఓ ముఠాను కూడా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో పీడీ యాక్ట్ కింద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య దర్యాప్తు ప్రారంభించి పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో ఖైజర్ అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఖైజర్ సంపాదించిన ఆస్తిలో ఇళ్లు, రిసార్ట్, హోటళ్లు ఇతరత్రా ఉన్నాయి. అతడి నేరపూరిత చర్యల కారణంగా 2011 సంవత్సరంలో బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక సంవత్సరం కాలపరిమితి ముగిసిన తర్వాత, అతడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, మళ్లీ తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. 2014లో చట్టం కింద నిర్బంధించి చర్లపల్లి జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఈడీకి రెఫర్ చేశారు.

ఖైజర్ పిక్ పాకెటింగ్, దొంగతనాలతో నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. ఆ తర్వాత 1995లో వ్యక్తిగతంగా ఉన్న పగతో నాంపల్లిలోని గూడ్ షెడ్ అఫ్జల్ హత్య చేశాడు. అనంతరం కొద్ది కాలంలోనే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ ముఠాగా ఏర్పడి అమాయకులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు భూకబ్జాలు, దోపిడీలు లాంటి తదితర 22 క్రిమినల్ కేసుల్లో అతడి ప్రమేయం ఉందని.. తన అక్రమ కార్యకలాపాలతో దాదాపు రూ.100కోట్లు సంపాదించాడని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment