Telugu News » Fire Accident: టాటాఏస్ వాహనంలో చెలరేగిన మంటలు.. తప్పిన ముప్పు..!

Fire Accident: టాటాఏస్ వాహనంలో చెలరేగిన మంటలు.. తప్పిన ముప్పు..!

డ్రైవర్ అప్రమత్తతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన జనగామ జిల్లాలో వరంగల్-హైదరాబాద్(Warangal-Hyderabad) జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

by Mano
Fire Accident: Fire broke out in a Tata Ace vehicle.. Missed threat..!

జాతీయ రహదారి(National High way)పై రన్నింగ్‌లో ఉన్న టాటాఏస్(TATA Ace) వాహనంలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన జనగామ జిల్లాలో వరంగల్-హైదరాబాద్(Warangal-Hyderabad) జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Fire Accident: Fire broke out in a Tata Ace vehicle.. Missed threat..!

చిల్వూర్ మండలం వంగాలపల్లి వద్ద మంగళవారం ఉదయం ఓ టాటాఏస్ వాహనం ప్రయాణికులతో వెళ్తుండగా అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు సూచించడంతో వెంటనే వాహనాన్ని ఆపాడు.

దీంతో ప్రయాణికులంతా కిందకు దిగారు. అయితే టాటా ఏస్ వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే టాటాఏస్ వాహనంలో షార్ట్ సర్వ్కూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

Fire Accident: Fire broke out in a Tata Ace vehicle.. Missed threat..!

నడిరోడ్డుపై టాటాఏస్ వాహనం దగ్ధమవుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలంలో ప్రమాద తీవ్రత అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

You may also like

Leave a Comment