Telugu News » నగరాల పేర్లు ఎందుకు మార్చారు… ఆ పుస్తకంలో ఆసక్తికర ప్రశ్నలు…!

నగరాల పేర్లు ఎందుకు మార్చారు… ఆ పుస్తకంలో ఆసక్తికర ప్రశ్నలు…!

పలు రాష్ట్రాల్లో మరికొన్ని నగరాల పేర్లను మారుస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ పేర్ల రాజకీయంపై జియాస్ ఉస్ సలామ్ రచించిన ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా ఎ క్రిటికల్ వ్యూ’అనే పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

by Ramu
A new book asks why a particular set of cities in India being renamed

– నగరాల పేర్ల చుట్టూ వివాదం
– ప్రయాగ్ రాజ్ గా మారిన అలహాబాద్
– అయోధ్య జిల్లాగా మారిన ఫైజాబాద్
– యూపీలోనే అధికంగా మార్పులు
– ‘‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా’’ పుస్తకంలో..
– ఆసక్తికర విషయాలు

దేశంలో పలు నగరాల పేర్లను బీజేపీ సర్కార్ మారుస్తూ వస్తోంది. ఇప్పటికే యూపీ ప్రభుత్వం సుమారు 15 నగరాల పేర్లను మార్చింది. పలు రాష్ట్రాల్లో మరికొన్ని నగరాల పేర్లను మారుస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే.. ఈ పేర్లపై జియాస్ ఉస్ సలామ్ రచించిన ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా ఏ క్రిటికల్ వ్యూ’ అనే పుస్తకంలో కొన్ని విషయాలను పొందుపరిచారు

దీనిపై వివాదం చెలరేగుతోంది. పుస్తకంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇలా నగరాల పేరు మార్పు తెరపైకి వచ్చిన ప్రతిసారి వలసవాదం అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకు వస్తారట. గతంలో ప్రధాన మోడీ మాట్లాడుతూ… మనం 1200 ఏండ్ల నాటి బానిస మనస్తత్వంతో ఇబ్బంది పడుతున్నామని, దానికి ముగింపు పలకాలని అన్నారు. దాని అర్థం సుల్తాన్, మొఘల్, బ్రిటిష్ పాలన కాలాన్ని కలిపి ఆయన లెక్కించారు. మోడీ దృష్టిలో బ్రిటీష్ పాలకులు, మొఘల్ చక్రవర్తులు ఇద్దరు ఒకటే. అందుకే ముస్లిం పేరు ఉన్న నగరాల పేర్లు మారుస్తున్నారని పుస్తకంలో రాశారు.

A new book asks why a particular set of cities in India being renamed

బీజేపీ అధికారంలోకి వచ్చాక మొఘల్ చక్రవర్తులు, సలామ్ సుల్తానేట్ రాజులు, ప్రభువులు, సాధువులు, మనసబ్ దార్లు స్థాపించిన నగరాలు, పట్టణాల పేర్లను మాత్రమే మార్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. వందల ఏండ్లుగా అలహాబాద్, ఔరంగాబాద్, అలీఘర్, ఉస్మానాబాద్ పేరుతో అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. కానీ, బీజేపీ సర్కార్ వచ్చాక ఆయా నగరాల పేర్ల మార్పులు చకచకా జరిగిపోయాయని తెలిపారు.

అలహాబాద్ అంటే ‘అల్లా నివాసం’అని అర్థం. కానీ, దాన్ని ప్రయాగ్ రాజ్ గా మార్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని పుస్తకంలో పొందుపరిచారు. ఈ నగరానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ ‘ఇల్లాహ బాద్’ లేదా ‘ఇల్లాహి బాస్’ అని పేరు పెట్టారు. ఇల్లాహి అంటే దేవుడు అని అర్థం. ఇల్లాహి బాస్ అంటే ‘దేవుళ్ల నివాసం’ అని అర్థం వస్తుంది. అక్బర్ ఈ స్థలాన్ని హిందువుల పవిత్ర నగరంగా భావించారని చరిత్రకారుడు బదౌని వివరించారు.

అక్కడ పవిత్ర నదీ సంగమం వద్ద మరణిస్తే దేవుడిలో ఐక్యం అయిపోతారనే విషయం తెలిసి దానికి ‘దేవతల నివాసం’ అని అక్బర్ పేరు పెట్టారు. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ పేరు చెక్కు చెదరకుండా, నదుల సంగమ ప్రాంతాన్ని అలాగే వదిలేశారు. ఇక పురాణాల విషయానికొస్తే, ‘ఇల’ అనేది ఐల తెగకు మూలపురుషుని తల్లి పేరు. మహాభారతం ఇలా అనే పేరును ఒక నదిగా లేదా రాజుగా కూడా పేర్కొంది. “వాస్” అంటే మళ్ళీ నివాసం. అలా చూసినా ‘ఇలా వాస్’ అనేది హిందువులు పెట్టిన పేరు. అలాంటప్పుడు అలహాబాద్ పేరును ‘ఇలా వాస్’గా మార్చి ఉండాల్సింది.

కానీ అలా చేయలేదు. గతంలో ప్రయాగ, అలహాబాద్ కలిసి ఉండేవి. ఇప్పుడు ప్రయాగ పేరు తెరపైకి రావాలంటే అలహాబాద్ పేరును పూర్తిగా తుడిచి పెట్టాలి. అందుకే అలహాబాద్ పేరును భారత దేశ మ్యాపులో కనిపించకుండా చేశారని పుస్తకంలో రాశారు. అవధ్ మొదటి నవాబ్ సాదత్ అలీ ఖాన్ 1730లో ఘఘ్రా నది ఒడ్డున ఫైజాబాద్‌ ను నిర్మించారు. కానీ, ఆ ప్రాంతంలో పక్కనే రాముడి జన్మస్థలంగా గుర్తించిన అయోధ్య ఉంది. దీంతో ఆ నగరం పేరును మార్చేందుకు అలీఖాన్ ప్రయత్నించలేదు.

ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి అయోధ్యను ప్రత్యేకంగా గుర్తిస్తూ వస్తున్నారు. కానీ, యోగి సర్కార్ వచ్చాక కొత్తగా అయోధ్యకు ఏదో గుర్తింపు ఇస్తున్నట్టు ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చి మరో నగరాన్ని భారత దేశ పటం నుంచి తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment