Telugu News » Bhajan Lal Sharma : నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణం…!

Bhajan Lal Sharma : నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణం…!

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు పిపుల్స్ ప్రిన్సెస్ ‘దియా కుమారి’, సీనియర్ బైర్వాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

by Ramu
Bhajan Lal Sharma takes oath as Rajasthans new chief minister

రాజస్థాన్ (Rajasthan CM)నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ (Bajanlal Sharma) ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్ రాజ్ భవన్‌లో భజన్ లాల్‌తో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు పిపుల్స్ ప్రిన్సెస్ ‘దియా కుమారి’, సీనియర్ బైర్వాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

Bhajan Lal Sharma takes oath as Rajasthans new chief minister

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరోవైపు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాకుల గాను 115 స్థానాల్లో విజయం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నూతన సీఎం ఎంపికపై అధిష్టానం కసరత్తులు చేసింది. ఆ సమయంలో వసుంధర రాజే సీఎం అవుతారని చాలా మంది భావించారు. సీఎం సీటు విషయంలో ఆమెతో పాటు బాబా బాలక్‌నాథ్‌, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ మేఘ్వాల్‌ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి.

ఈ క్రమంలో బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో భజన్ లాల్ సంగనేర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థిపై 48,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ కు 97,081 ఓట్లు రాగా, భజన్ లాల్‌కు 1,45,162ఓట్లు వచ్చాయి.

You may also like

Leave a Comment