తెలంగాణ ఎన్నికల హడావిడి పూర్తయిపోయింది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఘనవిజయాన్ని సాధించారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి కాలు పెట్టినప్పుడు ముందు టిఆర్ఎస్ లోనే చేరారట దాదాపు 3 ఏళ్ల పాటు కల్వకుర్తి నుండి పోటీ చేయడం కోసం టికెట్ కోసం ఎదురుచూసారు. టికెట్ రాకపోవడంతో ఎంతో బాధపడ్డారట. కానీ అక్కడితో ఆగిపోలేదు రేవంత్ రెడ్డి సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుండి ఆయన అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు ఆయన ఒక ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు.
Also read:
సాధారణ స్థాయి నుండి సీఎం పదవికి చేరుకున్నారు కేసీఆర్ కి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి కనపడ్డారు. కేసీఆర్ తో పోటీ కి దిగే సత్తా ఉన్న నేతగా ఆయన నిలిచారు. అయితే కెరీర్ మొదట్లో కేసీఆర్ నిర్ణయం కోసం చాలా ఎదురు చూశారట. 2004లో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చే టికెట్ కోసం ఎంతగానో ఎదురు చూసారు ఆ టైంలో కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉన్నట్లయితే ఈసారి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కి పోటీ కి వచ్చేవారు కాదు.
రేవంత్ రెడ్డి స్టూడెంట్ గా ఉన్నప్పుడే నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా డిఫరెంట్గా వుంది. కేసీఆర్ ఇచ్చే టిక్కెట్ కోసం ఎదురుచూసి విసుకు చెందిన రేవంత్ రెడ్డి సొంతంగా పోటీ చేసి సీఎం పదవి కి చేరారు. 1992లో రేవంత్ రెడ్డి ఏబీవీపీ లో ఆక్టివ్ గా ఉండేవారట తర్వాత టీడీపీ కి మారిన కొంత కాలానికి టిఆర్ఎస్ లో చేరారు మూడేళ్లు చూసిన టికెట్ రాకపోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రయత్నం చేశారు.