Telugu News » ఎన్టీఆర్ గురించి తుమ్మల నాగేశ్వరరావు ఏం అన్నారో తెలుసా..?

ఎన్టీఆర్ గురించి తుమ్మల నాగేశ్వరరావు ఏం అన్నారో తెలుసా..?

by Sravya

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు ప్రజలు అనేక అంశాలని దృష్టి పెట్టుకుని ఓట్లు వేస్తూ ఉంటారు. గెలుపుని బట్టి రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు అయితే రాజకీయ నాయకులు కాలానికి తగ్గట్టు మారుతూ ఉన్నా కూడా కొన్ని అంశాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని సంఘటనలు కొన్ని బంధాలు కొన్ని ఫోటోలు కొంతమంది మనుషుల్ని మనం మర్చిపోలేక పోతూ ఉంటాము. రాజకీయాలు అటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఆయనతో పని చేసిన రాజకీయ నాయకులకి ప్రత్యేక అనుబంధాలను అనుభూతుల్ని అందించారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో ఎన్టీఆర్ తో పాటుగా ఒక ఆయన కనబడుతున్నారు. ఎన్టీఆర్ పక్కన ఉన్న ఆ వ్యక్తి కూడా పాపులర్ రాజకీయ నాయకుడు. అతను ఎవరో మీరు గుర్తుపట్టారా..? అతను ఎవరో కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. కులానికి సంబంధించి ఆయనకి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి చెప్పారు. 1982 నుండి ప్రతి ఏటా ఖమ్మం సంఘం సమావేశానికి ప్రజాప్రతినిధిగా హాజరవుతూ ఉండేవారట. కమ్మగా పుట్టడం నా అదృష్టం పునాది రాయి అని కూడా ఆయన చెప్తూ ఉండేవారు.

Also read:

ఒకసారి కమ్మ సంఘం వేడుకకి మొత్తం 50 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ నేనొక్కడినే వెళ్లానని ఆయన చెప్పారు. మంత్రి అయిన మూడు నెలల తర్వాత ఈ విషయం గురించి ఎన్టీఆర్ నన్ను అడిగారు. ఆ సమావేశానికి ఎందుకు వెళ్లారు అని నేను ఆ కులంలోనే పుట్టాలని అందుకు గర్వపడుతున్నానని అందుకే వెళ్ళానని చెప్పారు. నిజానికి ఇలా వెళ్లడం వలన ఆ ప్రభావం పార్టీపై చెడుగా పడుతుందేమో అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అలా ప్రశ్నించారు కానీ నేను సమాధానం చెప్పిన తర్వాత ఎన్టీఆర్ లేచి కౌగిలించుకున్నారు అని చెప్పారు. కులాన్ని గౌరవించడం తప్పులేదు కానీ ఇతర కులాల్ని దూషించమని చెప్పడం దీని అర్థం కాదని ఎన్టీఆర్ వివరించారు. తుమ్మల ఈ విషయాలపై మాట్లాడి నేను కులాన్ని చూసి బంధాన్ని పెంచుకొని ఇప్పటికీ నా దగ్గర పని చేసే వారి కులాలు ఏంటో నాకు తెలియని నా వర్కింగ్ స్టైల్ అంతేనని ఆయన చెప్పడం జరిగింది.

You may also like

Leave a Comment