Telugu News » Earthqauke : డ్రాగన్ కంట్రీలో భారీ భూకంపం…111 మంది మృతి…!

Earthqauke : డ్రాగన్ కంట్రీలో భారీ భూకంపం…111 మంది మృతి…!

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 111 మంది మరణించినట్టు తెలుస్తోంది. గాన్సు ప్రావిన్సులో 86 మంది, క్వింగాయ్ ప్రావిన్సులో 9 మంది మరణించినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.

by Ramu
Over 110 Dead Several Injured As Massive Earthquake Hits China

చైనా (China)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. వాయవ్య చైనాలోని గాన్సు, క్వింగాయ్ ప్రావిన్సుల్లో ఈ భూకంపం సంభవించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 111 మంది మరణించినట్టు తెలుస్తోంది. గాన్సు ప్రావిన్సులో 86 మంది, క్వింగాయ్ ప్రావిన్సులో 9 మంది మరణించినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.

Over 110 Dead Several Injured As Massive Earthquake Hits China

 

గాన్సు, క్వింగాయ్ ప్రావిన్సుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 250 మందికి గాయాలయ్యాయి. భూకంపం వల్ల భారీ ఆస్టినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. భూకంపం ధాటికి ఆయా ప్రావిన్సుల్లో పెద్ద పెద్ద భవనాలు నేల మట్టం అయ్యాయి. రోడ్లపై ఎటు చూసిన శిథిలాలే కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు మీడియా తెలిపింది.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భూకంపం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు పునారావాసం ఏర్పాటు చేయాలని అన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆయన సూచించారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే, 6.2 జిన్హూవా విభాగం వెల్లడించింది. గాన్సు, క్వింగాయ్ సరిహద్దుల్లో హైడాంగ్ కు సమీపంలో ఈ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. నిన్న అర్ధరాత్రి ధాటిన తర్వాత భూమిలో 10 కిలో మీటర్లల లోతులో భూమి కంపించినట్టు తెలిపింది. మరోవైపు
ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్‌లో 570 కిలోమీటర్ల (350 మైళ్ళు) దూరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జిన్హువా చెప్పింది.

 

You may also like

Leave a Comment