కెసిఆర్ అంటే జనంలో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. కేసీఆర్ ని కొందరు విమర్శించొచ్చు. కొంతమంది ఆకాశానికి ఆయన్ని ఎత్తేస్తూ ఉంటారు. భారత రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ బాపు అని ఆయన్ని పిలవచ్చు. ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు రాజకీయాల్లో గండరగండడు అని అనొచ్చు కానీ అలాంటి కేసీఆర్ రాజకీయ ప్రయాణం గురించి మీకు తెలుసా..? రాజకీయ నేపథ్యం విషయానికి వస్తే మొండిగానే రాజకీయాల్లోకి ఆయన వచ్చారు 1983లో తెలుగుదేశం పార్టీ తరపు నుండి కేసీఆర్ పోటీ చేశారు. తొలిసారి అయిన పోటీ చేసినప్పుడే ఓడిపోయారు. ఓటమి ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో అయిన తరపున ప్రచారం చేయడానికి సీనియర్ ఎన్టీఆర్ వస్తారని మాట ఇచ్చారు.
కేసీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురుచూశారు. ఆయన వస్తారని ఎంతగానో నమ్మకాన్ని పెట్టుకున్నారు కానీ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకి టైం సరిపోలేదు ఆయన షెడ్యూల్ టైట్ గా ఉండడంతో ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్లలేక పోయారు. ప్రచారం చేయలేకపోయారు ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల ఫలితం ఈ కారణంగానే వచ్చింది. కేసీఆర్ కి ఓటమి మిగిలింది. ఆ ఫలితాల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇప్పటికి కూడా సీనియర్లు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు.
Also read:
కేసీఆర్ రాజకీయ ప్రవేశము కాంగ్రెస్ పార్టీ నుండి మొదలైంది ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ప్రపంచం చూసి టిడిపిలో చేరారు. 83 లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మదన్మోహన్ పోటీ చేశారు. ఎన్టీఆర్ సపోర్ట్ ఉండడంతో తాను సులభంగా గెలుస్తానని కేసీఆర్ అనుకున్నారు కానీ మదన్ మోహన్ గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే సంచలనాన్ని సృష్టించారు ఆయన ప్రసంగంతో తెలంగాణ సమాజాన్ని ఆలోచించేలా చేసారు. 1983లో కెసిఆర్ ఓడిపోయారు ఓటమిని గెలుపు పాటంగా మార్చుకున్నారు 1989 , 1994 వరుస ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారు 2004లో మదన్మోహన్ చనిపోయారు అయితే ఈ క్రమంలో తనకి ఓటమి రుచి చూపించి తనలో గెలవాలని కసిని పెంచిన మదన్మోహన్ ని రాజకీయ గురువుగా కేసీఆర్ ప్రకటించారు.