Telugu News » Covid-19 : దేశంలో 21 జేఎన్ వేరియంట్ కేసులు….!

Covid-19 : దేశంలో 21 జేఎన్ వేరియంట్ కేసులు….!

గోవాలో అత్యధికంగా 19 కేసులు నమోదు అయ్యాయి. కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొత్త వేరియంట్ పై రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.

by Ramu

కరోనా (Covid-19)చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో జేఎన్-1 (JN-1)కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఉప రకానికి చెందిన కేసులు 21 నమోదైనట్టు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. గోవాలో అత్యధికంగా 19 కేసులు నమోదు అయ్యాయి. కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొత్త వేరియంట్ పై రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.

21 cases of new covid variant jn1 in india confirmed in lab tests

దేశంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇది పూర్తి ప్రభుత్వ విధానంతో కలిసి పని చేయాల్సిన సమయం అని మాండవియా అన్నారు. కొవిడ్ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కానీ కరోనా గురించి భయపడాల్సిన పని లేదన్నారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిద్దామని సూచించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజకీయాలు వద్దన్నారు. కొవిడ్ ఇంకా పూర్తిగా తొలిగినట్టు కాదని పేర్కొన్నారు. కరోనా కేసులు, లక్షణాలు, కేసుల తీవ్రతపై రాష్ట్రాలు నిఘా పెడుతూ, తగిన పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ప్లాన్‌ను సిద్ధం చేయాలన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు తక్కువగానే ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదర్శన్ పంత్ వెల్లడించారు. గత రెండు వారాల డేటాను పరిశీలిస్తే డిసెంబర్ 6న 115 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 614కు పెరిగిందన్నారు. వారిలో 92.8 శాతం కేసులు హోం ఐసొలేషన్‌లోనే ఉన్నాయన్నారు. అది కూడా చాలా స్వల్ప అస్వస్థతేనన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరగలేదన్నారు.

You may also like

Leave a Comment