Telugu News » Ponmudy : అవినీతి కేసులో మంత్రికి భారీ షాక్… మూడు నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు….!

Ponmudy : అవినీతి కేసులో మంత్రికి భారీ షాక్… మూడు నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు….!

అక్రమాస్తుల కేసులో పొన్ముడి దంపతులకు మద్రాస్ హైకోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పొన్ముడితో పాటు ఆయన సతీమణి విశాలక్షిపై రూ, 50 లక్షల జరిమానాను జస్టిస్ జయచంద్రన్ విధించారు.

by Ramu
Madras HC sentences TN Minister K Ponmudi to 3 years of simple imprisonment in DA case

తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి (Tamilnadu Higher Education MInister) కె. పొన్ముడికి (Ponmudy) భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో పొన్ముడి దంపతులకు మద్రాస్ హైకోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పొన్ముడితో పాటు ఆయన సతీమణి విశాలక్షిపై రూ, 50 లక్షల జరిమానాను జస్టిస్ జయచంద్రన్ విధించారు.

Madras HC sentences TN Minister K Ponmudi to 3 years of simple imprisonment in DA case

రూ. 50 లక్షల జరిమానాను చెల్లించడంలో విఫలమైతే పొన్ముడి దంపతులకు మరో ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పొన్ముడి దంపతులకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పొన్ముడి దంపతులకు న్యాయస్థానం నెల రోజుల సమయం ఇచ్చింది.

1996-2001లో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన సమయంలో పొన్ముడి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC)కేసులు నమోదు చేసింది. పొన్ముడి మొత్తం రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కానీ ఈ కేసులో సరైన సాక్ష్యాలను డీవీఏసీ సమర్పించలేక పోయింది. దీంతో పొన్ముడిపై కేసును కోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఈ ఏడాది జూలైలో మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు కింద కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టింది. తాజాగా ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు పొన్ముది దంపతులకు జైలు శిక్ష విధించింది.

You may also like

Leave a Comment