తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారుల బదిలీ చేపట్టింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు (IAS), ఒక ఐపీఎస్ (IPS) అధికారిని తెలంగాణ ప్రభుత్వం ( Telangna Governament) బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ. శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు టీఎస్‌ఐఐసీ ఎండీగా ఇ.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న జ్యోతి బుద్ద ప్రకాశ్‌ను ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా నియమించినట్టు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోలీకేరిని ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆమెకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆమెను ప్రభుత్వం ఆదేశించింది. భారతీ హోళికేరి స్థానంలో రంగారెడ్డి నూతన కలెక్టర్‌గా గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్ పొత్రు విధులు నిర్వర్తిస్తున్నారు.
పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న దేవేంద్ర సింగ్ చౌహాన్ కు పౌరసరఫరాల కమిషనర్‌గా బాధ్యతలను అప్పగించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ శ్రుతి ఓజాను ఇంటర్ మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా నియమించారు. ఇక గిరిజ సంక్షేమ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టియాన చొంగ్తును రిలీవ్ చేస్తూ ఆమె స్థానంలో ఈవీ నర్సింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది.