Telugu News » Congress: దేశమంతా కుల గణన.. కాంగ్రెస్ హామీ..!

Congress: దేశమంతా కుల గణన.. కాంగ్రెస్ హామీ..!

ఇటీవల తెలంగాణలో కేసీఆర్ ప్రభావానికి కాలం ముగియగా, త్వరలో ప్రధాని మోడీ అనే మెడిసిన్‌ కు కాలం చెల్లిపోతుందని వెల్లడించారు.

by admin
Rahul Gandhi in Nagpur

– దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది
– ప్రధాని మోడీకి ఏమీ పట్టడం లేదు
– కాంగ్రెస్ వ్యవస్థాపక కార్యక్రమంలో రాహుల్ గాంధీ
– సీఎం రేవంత్ రెడ్డి హాజరు
– ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు
– తెలంగాణలో కేసీఆర్ ప్రభావానికి కాలం ముగియగా..
– మోడీ అనే మెడిసిన్‌ కు కాలం చెల్లిపోతుందని విమర్శలు

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్ పూర్ లో ‘హై తయార్ హమ్'(మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావ జాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.

Rahul Gandhi in Nagpur

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే పొలిటికల్ లీడర్ల ప్రభావం కూడా కొంత కాలం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో కేసీఆర్ ప్రభావానికి కాలం ముగియగా, త్వరలో ప్రధాని మోడీ అనే మెడిసిన్‌ కు కాలం చెల్లిపోతుందని వెల్లడించారు.

దేశంలో మోడీ మెడిసిన్ ఇక పనిచేయదని అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర చేసిన భారత్ జోడో యాత్రతో మొదట కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ యాత్ర మహారాష్ట్రలోకి వస్తుందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు చేపడుతున్న భారత్ న్యాయ యాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా పని చేయదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు చాలా కీలకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment