దక్షిణ కొరియా (South Korea) తమ ప్రధాన శత్రువు అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ( Kim Jong Un)తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాన్ని నివారించే ఉద్దేశం దక్షిణ కొరియాకు లేదని అన్నారు. సరిహద్దుల్లో సూది మొనంత స్థలాన్ని ఆక్రమించినా యుద్ధం తప్పదని హెచ్చరించారు.
దేశ రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. పునరేకీకరణ కోరడం అనేది అతి పెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. దక్షిణ కొరియాను ఆక్రమించుకుని లొంగదీసుకునేలా అనుమతులు జారీ చేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా అనేది దక్షిణ కొరియా నుంచి వేరుగా ఉన్న భాగమని చెప్పారు.
తమ భూభాగం, గగనతలంలో దక్షిణ కొరియా మిల్లీ మీటర్ ప్రాంతాన్ని ఆక్రమించినా దాన్ని కవ్వింపు చర్యగా తాము భావిస్తామన్నారు. తాము యుద్దం కోరుకోవడం లేదని పేర్కొన్నారు. కానీ యుద్ధాన్ని నివారించే ఉద్దేశం మాత్రకు తమ లేదని వెల్లడించారు. యుద్ధంలో దక్షిణ కొరియాను పూర్తిగా ఆక్రమించాలని, ఆ దేశాన్ని పూర్తిగా లొంగదీసుకోవాలని సూచించారు.
ఇకపై దక్షిణ కొరియా, ఆ దేశ పౌరులను తోటి దేశస్థులుగా పేర్కొనకూడదన్నారు. దక్షిణ కొరియా పునరేకీకరణకు చెందిన స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేయాలన్నారు. ఆ భారీ స్థూపం నేత్రాలకు వేదన మిగులుస్తోందని విమర్శలు చేశారు. అంతర్-కొరియా కమ్యూనికేషన్‌ను అంతం చేయాలన్నారు. ఆ దేశంతో జరిగిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని వెల్లడించారు.