లండన్ (London) పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం తాజాగా దుబాయ్ చేరుకుంది. మూసీ నదిని అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి పలు అంతర్జాతీయ సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చిస్తోంది. ఇందులో భాగంగా ప్పటికే మూసీ నది ప్రక్షాళనపై లండన్ లో థేమ్స్ రివర్ అథారిటీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
థేమ్స్ నది నిర్వహణ గురించి నిపుణులు సీఎం బృందానికి వివరించారు. తాజాగా దుబాయ్ లో నిపుణులతో సమావేశం అయ్యారు. సమావేశంలో సుమారు 54 కిలో మీటర్ల మేర మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశంపై నిపుణులతో చర్చించారు.
దీంతో పాటు మూసీ నదీ సుందరీకరణ గురించి దానితో పాటు కలిగే వాణిజ్య అవకాశాల గురించి నిపుణులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 70 అంతర్జాతీయ సంస్థలతో సీఎం బృందం చర్చించింది.పలు దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆయా సంస్థలు సీఎం బృందానికి వివరించాయి.
ఈ సందర్బంగా మూసీ నది అభివృద్ధి సుందరీకరణ పనులు చేపట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.ఈ అర్ధరాత్రి వరకు మరికొన్ని సంస్థలతో సీఎం బృందం చర్చించనుంది. సమావేశాల అనంతరం దుబాయ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.