కరీంనగర్ బీఆర్ఎస్ (BRS) సమావేశంలో రచ్చ జరిగింది. పార్టీ (Party)లో ఉద్యమకారులకు కాకుండా ఇతరలకు ప్రాధాన్యత లభించిందని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమకారులకు న్యాయం చేయలేదంటూ కార్యకర్తల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
కార్యకర్తలను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రసమయి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని వాపోయారు.
మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ఇది ఒక కారమణి పేర్కొన్నారు. దీంతో ఆయన్ని ఇతర కార్యకర్తలు మందలించారు. కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆరోపణలు గుప్పించారు. కేవలం ఎన్నికల సమయం రాగానే ఆయనకు కార్యకర్తలు గుర్తుకు వస్తాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం ఏదో సమావేశాలు నిర్వహించి పార్టీని గెలిపించాలంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పార్టీలో చిన్న లీడర్లను కూడా పట్టించుకుని వారికి సహకరించాలన్నారు. దీంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఆయన కూర్చోక పోవడంతో రచ్చ జరిగింది.