Telugu News » Kavitha : స్థానిక సంస్థల ఎన్నికలను ఆగమాగం నిర్వహించాలనుకుంటే ఊరుకోం…!

Kavitha : స్థానిక సంస్థల ఎన్నికలను ఆగమాగం నిర్వహించాలనుకుంటే ఊరుకోం…!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ (BC Declaration) లో ప్రకటించినట్టుగా 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

by Ramu
mlc kavitha said that local body elections should be held only after the caste census

పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ (BC Declaration) లో ప్రకటించినట్టుగా 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

mlc kavitha said that local body elections should be held only after the caste census

వరంగల్‌‌లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ… ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్…. తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి గతంలో అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని సాధించామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారి చూపించామని వెల్లడించారు.

రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆగమాగం నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. బిహార్‌లో కులగణనప్పటికీ కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని మండిపడ్డారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా సుమారు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు అవుతారని గతంలో కాంగ్రెస్ వెల్లడించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ముందడుడు వేయడం లేదన్నారు.

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదని తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని…. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని పేర్కొన్నారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు

హక్కుల కోసం పోరాటం చేయాలంటే..తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.

 

You may also like

Leave a Comment