వేసవి కాలం అప్పుడే మొదలైందా అనేలా ఎండలు దంచికొడుతున్నాయి.. సరిగ్గా ఇదే సమయం దొంగలకు చాలా అనుకులమైందని తెలిసిందే. మండిపోతున్న ఎండలకు రాత్రి సమయంలో గాఢ నిద్రలోకి జారుకొంటారు జనం. అదీగాక ఆరుబయట నిద్రించడం.. తలుపులు తెరచి పడుకోవడం వంటివి చేస్తుంటారు.. ఈ సమయంలో చోరులు రెచ్చిపోతారు. ఇక తాజాగా దొంగతనాలు మొదలైయ్యాయని హింట్ ఇచ్చారు..
దేవరకద్ర (Devarakadra) మండల పరిధిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గోపులాపూర్ (Pedda Gopulapur) గ్రామానికి చెందిన తిమ్మన్న వృత్తిరీత్యా ప్లంబర్ పని చేస్తూ ముంబైలో జీవనం సాగిస్తున్నాడు. ఇది గమనించిన దొంగలు శనివారం అర్ధరాత్రి ఇంటికి వేసిన తాళం విరగొట్టి, ఇంట్లో చొరబడి బీరువాలో దాచిన రెండు లక్షల విలువగల 30 తులాల వెండి, తులంనర బంగారం, ఇతర వస్తువులు అపహరించారు.
అక్కడితో ఆగని ఆ చోరులు సీసీ కెమెరాలకు సంబంధించిన స్టోరేజ్ బాక్స్ ను కూడా ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్న దేవరకద్ర ఎస్సై డి నాగన్న (SI D Naganna).. క్లూస్ టీం తో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.