Telugu News » Harish Rao : బ్యారేజీలో రెండు కుంగిపోతే…. హరీశ్ రావు కీలక వ్యాఖలు…!

Harish Rao : బ్యారేజీలో రెండు కుంగిపోతే…. హరీశ్ రావు కీలక వ్యాఖలు…!

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించ వద్దని తాము నిద్ర లేపితే లేచారని కాంగ్రెస్ పై మండిపడ్డారు.

by Ramu
Harish rao slams congress government on medigadda barrage route
మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ (Congress) పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించ వద్దని తాము నిద్ర లేపితే లేచారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఈ రోజు బీఆర్‌ఎస్‌ సభ ఉండటంతో ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు పోటీగా ఈ కార్యక్రమం పెట్టారని  ఆరోపించారు.
Harish rao slams congress government on medigadda barrage route
అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌ రావు మాట్లాడుతూ….కాంగ్రెస్‌ ప్రభుత్వ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. శాసన సభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదని తెలిపారు. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అని వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగ నాయక సాగర్‌ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని అన్నారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని చెప్పారు. కాళేశ్వరం ఫలితాలను గురించి రైతులను అడగాలని సూచించారు.
ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ కూలి 20 మంది చనిపోయారని గుర్తు చేశారు.  దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయని చెప్పారు. అలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. కానీ తాము ముందుకు వెళ్లాం కదా అని వెల్లడించారు.

You may also like

Leave a Comment