బీఆర్ఎస్ (BRS)ను వరుసగా ఆ పార్టీ నేతలు వీడుతున్నారు. తాజాగా గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Mahender reddy) దంపతులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కూడా హస్తం పార్టీలో చేరారు.
సునీతా మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి టీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆహ్వానించారు.
ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిదద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో వారు కాంగ్రెస్ వీడబోతున్నట్టు ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన హస్తం పార్టీలో చేరతారని టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన కాస్త వెనుకడగు వేశారు. ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరంతా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీభవన్‌లో కండువా కప్పి పార్టీలోకి ఆమె పార్టీలోకి ఆహ్వానించారు.