Telugu News » Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..!

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..!

రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు.

by Mano
Goods Train: Derailed goods.. Interruption of train traffic..!

ఖమ్మం-విజయవాడ మార్గం(Khammam-Vijayawada route)లో ఓ గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది. ఈ ఘటన చింతకాని మండలం పాతర్లపాడు(Chintakani Mandal Patarlapadu) వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది.

Goods Train: Derailed goods.. Interruption of train traffic..!

రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్ అప్రమత్తమై గూడ్స్‌ రైలును వెంటనే నిలిపివేశాడు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి.

సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు.

ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

You may also like

Leave a Comment