వేసవి కాలం దొంగలకు అనుకులమైనదిగా భావిస్తారన్న సంగతి తెలిసిందే. వేసవి సెలవులకు జనం ఊర్లకు, తీర్థ యాత్రలకు ఎక్కువగా వెళ్ళడం తెలిసిందే. ఇక పగలంతా పని చేసి ఆదమరచి నిద్రలోకి జారుకుంటారు.. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఆసరాగా చేసుకొని దొంగలు (Thieves) రెచ్చిపోవడం కనిపిస్తోంది. ప్రస్తుతం వేసవి వచ్చింది కదా.. ఇక దొంగలు కూడా తమ చేతులకు పనికల్పించారు.
ఈ క్రమంలో దొంగలు జహీరాబాద్ (Zaheerabad) పట్టణంలో విరుచుకుపడ్డారు. షటర్లు ద్వంసం చేసి పలు షాపుల్లో నగదు, వైన్స్లలో మద్యంతో పాటు, నగదు తదితర విలువైన వస్తు సామగ్రిని దొరికిన కాడికి దోచేసారు. నిన్న రాత్రి సమయంలో జహీరాబాద్ చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న వినాయక వైన్స్ (Vinayaka Wines), పస్తాపూర్ చౌరస్తాలోని జై భవాని వైన్స్, ఓల్డ్ వాణి జూనియర్ కాలేజ్ (Old Vani Junior College) వద్ద 3 బట్టల దుకాణాల్లో, సుభాష్ గంజ్‌లోని గణేష్ సాయి ట్రేడర్స్‌లో దొంగతనానికి పాల్పడ్డారు.
ఇక చోరీ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు (Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సీసీ పుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు జహీరాబాద్ పట్టణంలో చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో షట్టర్ దొంగలు బీభత్సం సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఈ చోరీలో జరిగిన నష్టం ఎంత, పోయిన డబ్బులు ఎన్ని, ఏయే దుకాణాల్లో చోరీ జరిగింది, ఎంతమంది ముఠా సభ్యులు ఈ దొంగతనంలో పాల్గొన్నారు. అనే తదితర వివరాలు తెలియవలసి ఉంది.