ఐటీడీఏ (ITDA) ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆరోపించారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆ దిశగా అధికారుల ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. తాజాగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ…
పదేండ్ల కాలంలో ఐటీడీఏ సమావేశాలను నిర్వహించకుండా వాటి ఉద్దేశాలను బీఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని తీవ్రంగా విరుచుకు పడ్డారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలకమండలి సమావేశంలో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
గిరిజనులకు విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధికి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు అధికారుల ప్రణాళికలు ఉండాలని సూచించారు.