మేడారం జాతర(Medaram Jathara) దృష్టిలో ఉంచుకుని వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ములుగు జిల్లా(Mulugu District) కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క సారక్క జాతర(Sammakka Sarakka Jathara) సందర్భంగా మూడు రోజుల పాటు లోకల్ హాలీడే(Local Holiday)ను ప్రకటించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector like Tripathi).
ఈనెల 23, 24, 25 తేదీల్లో పాఠశాలలు సెలవులను ప్రకటించామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు రోజుల పాటు లోకల్ హాలీడేస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ స్థానిక సంస్థలతో కలిసి అమ్మవార్ల గద్దెల ఆవరణ, హరిత హోటల్, ఆర్టీసీ బస్టాండ్, చిలకల గుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతరకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు ఏవైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ (1800- 425-0620)లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 19వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. జాతరలో మొత్తం 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
జాతరలో ఎనిమిది జోన్లలో 42 సెక్టార్లుగా విభజించి మూడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో జోన్లో నోడల్ అధికారి, జోనల్ అధికారి, సెక్టోరల్ అధికారి విధుల్లో ఉంటారని తెలిపారు. మరోవైపు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మేడారంలో పర్యటించారు.