162
ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలోని జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సీనియర్ల వేధింపులు తాళలేక నర్సింగ్ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించింది.
ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.అయితే గతంలో కూడా ఈ కాలేజీలో ర్యాగింగ్ జరిగిందని సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.