తెలంగాణ ఇన్‌చార్జి(Telangana incharge Governer) గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ (CP Radakrishnan)ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాజ్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే (High court Cheif Justice lok Aradhe) ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm revanth reddy), హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సమస్యలపై రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్, సీఎస్ శాంతికుమారితో పాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొనసాగనున్నారు. ఈయన గతంలో తమిళనాడు బీజేపీ సీనియర్ లీడర్, బీజేపీ స్టేట్ చీఫ్‌గా కూడా పనిచేశారు.
1998,99 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఘనత రాధాకృష్ణన్‌కు చెందుతుంది.కాగా, గతేడాది ఫిబ్రవరిలో ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.