రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్(Congress government) అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత సర్కారు హయాంలో విచ్చలవిడిగా అక్రమ మద్యం(Illigal Liquer) దందాకు తెరలేపిన వారంతా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత బీఆర్ఎస్(BRS) హయాంలో వైన్ షాపులకు తోడు బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై (CM Revanth reddy) బెల్టులపై సీరియస్‌గా నజర్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ఏర్పాటై కార్యకలాపాలు సాగిస్తున్న బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గుట్టుగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు.
తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై గురువారం ఉదయం ఎస్వోటీ పోలీసులు దాడులు చేపట్టారు. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాగా, రానున్న రోజుల్లో ఈ దాడులు మరింత పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల హైదరాబాద్ పరిధిలో రూ.100 కోట్ల టాక్స్ ఎగవేత కేసులో ‘టానిక్’ మద్యం షాపులపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినందుకు కఠిన చర్యలకు ఎక్సైజ్ శాఖ ఉపక్రమించింది. అంతేకాకుండా టానిక్ టైమింగ్స్‌ను రాత్రి 11 గంటల వరకే పరిమితం చేశారు.