బ్రిటన్ క్యాబినెట్ (Britain Cabinet) లో మంత్రిగా భారతీయ మూలలున్న మహిళ నిన్న బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇప్పటికే భారత సంతాతికి చెందిన రిషీ సునాక్ (Rushi Sunak) బ్రిటన్ కు ప్రధానిగా ఉండగా…ఇప్పుడు ఆ క్యాబినెట్లో భారతీయ మూలాలున్న మహిళ ఇంధనశాఖ మంత్రిగా చేరారు.
భారత్ లోని గోవాకి చెందిన 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో (Claire Coutinho) ను ఆ దేశ ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు.
కరెంట్ బిల్లులను తగ్గించమే లక్ష్యం: కౌటినో
తన నియమాకం అనంతరం కౌటినో ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. శుద్ధ, చవకైన, స్థానికంగా ఉత్పత్తి చేసే ఇంధనానికి ప్రాధాన్యమిస్తానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రధానితో కలిసి పనిచేసి ఇంధన భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తానని, ఇంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బ్రిటన్ క్యాబినెట్లో యంగ్ మినిస్టర్…
కౌటినో ప్రస్తుతం బ్రిటన్ క్యాబినెట్లో అతి పిన్న వయస్కురాలైన మంత్రి. బ్రిటన్ ప్రధాని (Britain Prime Minister)గా ఉన్న రుషి సునాక్ లాగే కౌటినో కూడా బ్రిటన్‌లోనే జన్మించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు పెట్టుబడి, బ్యాంకింగ్ రంగంలో పని చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుండి మ్యాథ్స్ మరియు ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీని పొంది 2019లో ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ సర్రే పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో బ్రిటన్ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా, సునాక్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా, ఖజానాకు ఛాన్సెలర్‌గా కౌటినో పని చేశారు.
భవిష్యత్ బ్రిటన్ ప్రధాని…
కౌటినో నియమాకాన్ని పలు మీడియా సంస్థలు స్వాగతిస్తూ ఆర్టికల్స్ ప్రచురించాయి. ఆమె గతంలో చేసిన సేవలను కొనియాడుతూ…ఆమెపై చాలా బాథ్యత కూడా ఉందని రాశాయి.
“నా తల్లిదండ్రులు జనరల్ ప్రాక్టీషనర్లుగా పని చేయడంవ వలన ప్రజల సమస్యలను వింటూ పెరిగాను. దాంతో వాటికి సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కరాలు చూపించడం అలవాటు చేసుకున్నాను” అని కౌటినో అన్నారు.
కౌటినోకు భవిష్యత్తులో బ్రిటన్ ప్రధానిగా ఎదిగే అవకాశం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు తమ రిపోర్టులో పేర్కొంటున్నాయి.