తెలంగాణ రాజకీయాలు(Telangana politics)మరిఘోరంగా తయారయ్యాయి. విలువలు, క్రమశిక్షణ, ప్రజాసంక్షేమం గురించి లోకల్ (Local), జాతీయ పార్టీలు(National Parties) ఆలోచించడం లేదని ప్రస్తుతమున్న పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం జాతీయ పార్టీలుగా చెలామణీ అవుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ పొందడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.
అయితే, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తమ సొంత పార్టీ నేతలకు అవకాశం ఇవ్వకుండా గులాబీపార్టీ నుంచి వలస వచ్చిన వారికే ఎంపీ టిక్కెట్లను కట్టబెడుతున్నారు. అదేంటంటే మాకు ఎన్నికల్లో డబుల్ డిజిట్లు ముఖ్యం అంటున్నారు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఇప్పటికే పలు సర్వేలు సైతం స్పష్టంచేశాయి.
దీంతో ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సీనియర్లు, మాజీ మంత్రులు కూడా ముందుకు రావడం లేదు. కేసీఆర్ పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తానంటే బాబోయ్ మా వాళ్ల కాదంటూ పక్కపార్టీలోకి జంప్ అవుతున్నారు. ముందుగా ఎంపీ టికెట్ తమకే ఇస్తారని ప్రామిస్ తీసుకున్నాకే జాతీయ పార్టీల్లో తాజా, మాజీ గులాబీ లీడర్లు ఆ పార్టీలో చేరుతున్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుంటే రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇక బీజేపీలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన జంప్ జిలానీలకే ఆ పార్టీ పెద్దపీట వేసింది.
బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు మంచి చేయకపోగా చెడు చేశారని ఆ పార్టీని తెలంగాణ సమాజం ఓడిస్తే తిరిగి ఆ నేతలకే.. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్, అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ టిక్కెట్లు కేటాయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తికథనం..