Telugu News » IT Employees : ఐటీ ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. 77శాతం మందికి అనారోగ్య సమస్యలు?

IT Employees : ఐటీ ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. 77శాతం మందికి అనారోగ్య సమస్యలు?

ఐటీ ఉద్యోగులు(IT Employees) గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితులు మున్ముందు ఉన్నాయని పలు సర్వేలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ఐటీలో లక్షలాది ఉద్యోగులు కొలువులు పోయి రోడ్డున పడ్డారు.దీనంతటికి కంపెనీలు వివిధ కారణాలు చెప్పుకొచ్చాయి. కొందరు రెసిషన్ అని పేరు పెడితే మరికొందరు కాస్ట్ కటింగ్ పేరిట ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ వచ్చాయి.

by Sai

ఇక కరోనా టైంలో వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో అమెరికా, యూరప్ సహా పలుదేశాల్లో మాంద్యం ఎఫెక్ట్ కనిపించడంతో ఇండియాలోని ఐటీ కంపెనీలకు ప్రాజెక్టు తగ్గిపోయాయి. ఫలితంగా ఇన్‌ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, అసెంచర్, టెక్ మహింద్రా వంటి గ్లోబల్ కంపెనీలు చాలా మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చాయి.

ఉద్యోగాలు పోయాయని కొందరు, ఒత్తిడి(Stress)ని తట్టుకోలేక మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన అనేకం ఉన్నాయి. అయితే, ప్రస్తుతం హెచ్‌సీఎల్ (HCL)హెల్త్ కేర్ నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగులు పెను ముప్పును ఎదుర్కోబోతున్నారని ఒక్కసారిగా బాంబ్ పేల్చింది.

ఈ సర్వే ప్రకారం 77శాతం మంది ఐటీ ఉద్యోగులు అనారోగ్య సమస్యల(Health Issues)తో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 22శాతం మందికి ఊబకాయం, 17శాతం మందికి ప్రి డయాబెటిస్, 11శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని నిర్దారణ అయ్యింది. జంక్ ఫుడ్స్, నిద్రలేమి, గంటల తరబడి కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, ఆల్కహాల్, సిగరేట్స్ వల్ల ఇప్పటికే చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నట్లు తేలింది. ఐటీలో లక్షల సంపాదన ఉండొచ్చు కానీ, డబ్బుల వేటలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You may also like

Leave a Comment