దేశంలో న్యాయవ్యవస్థ(Judiciary) సమగ్రతకు ప్రమాదం వాటిల్లుంతోందని, రాజకీయ ఒత్తిళ్ల (Political pressure)నుంచి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని పలువురు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాతో సహా 600 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(CJI JUSTICE DY CHANDRACHUD)కు లేఖలు రాశారు.
నిరాధార ఆరోపణలు, పొలిటికల్ అజెండాలతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్స్ కేసుల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు.
న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసే అన్ని ప్రయత్నాలను కలిసి కట్టుగా ఎదుర్కోవాలని లాయర్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో న్యాయవ్యవస్థ పనితీరును తప్పుబట్టేందుకు అనేక కథనాలు వెలువడుతున్నాయి. వీటి వలన న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టులు ఎలాగైతే ప్రజలు, పీడిత పక్షాల తరపున నిలబడతాయో అలాగే ప్రజలు కూడా ఇలాంటి అసత్యాలను నమ్మకుండా న్యాయవ్యవస్థపై వారికి నమ్మకం కలిగేలా తదుపరి చర్యలు ఉండాలన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు గత గళాన్ని పెంచాలి. కోర్టులు ప్రజాస్వామ్యానికి మూల స్థంబాలుగా ఉండేలా చూడాలి అని స్పష్టంచేశారు. రాజకీయ నాయకులు ఎవరినైనా చూపించి వారు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తే.. వెంటనే కోర్టులు వాటిని సమర్థించడం వింతగా ఉందన్నారు. కోర్టు నిర్ణయం తమకు అనుకూలంగా రాకపోతే వారు మీడియా రూపంలో కోర్టులను విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పోవాలని, న్యాయవ్యవస్థను కాపాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.