పార్లమెంట్ ఎన్నికలకు ముందు నిర్వహించి ఓ సర్వేలో కేంద్రంలో మళ్లీ ఎన్డీయే(NDA) కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా మళ్లీ మోడీ (Pm MODI) ప్రమాణస్వీకారం చేస్తారని మరోసారి స్పష్టమైంది. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’(Mood Of the Nation) సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని 79 శాతం ఓటర్లు, ప్రధానిగా మోడీయే కావాలని 51శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఈనెల 13 నుంచి 27తేదీల మధ్య నిర్వహించిన డిజిటల్ సర్వేలో 7.59లక్షల మంది పాల్గొన్నారు. అందులో 79 శాతం మంది ఎన్డేయే కూటమికి జై కొట్టారు. మిగతా 21 శాతం మంది ఇండియా కూటమికి ఓకే చెప్పారు.
ఇక మోడీ సాధించి అతిపెద్ద విజయాల్లో అయోధ్య రామమందిరం నిర్మాణం అని 30.4 శాతం మంది నార్త్ ఇండియా ప్రజలు చెప్పగా.. డిజిటల్ ఇండియా చాలా సక్సెస్ అయ్యిందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వారిలో 57.16 శాతం మంది ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి రామమందిర నిర్మాణం ఒక కారణమని పేర్కొన్నారు.
ఇక ఇండియా కూటమి మోడీని అడ్డుకోలదా అని అడుగగా 32.28 శాతం మందే అవును అన్నారు. మిగతా 48.24 మంది ఇండియా కూటమికి విజయ్ లేదని, నాయకత్వం లోపం, ప్రధాని స్థానం కోసం చాలా మంది పోటీ పడుతున్నారని బుదులిచ్చారు. రాహుల్ న్యాయయాత్ర కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని 54.76 మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇక మోడీ వైఫల్యాల గురించి ప్రశ్నించగా..నిరుద్యోగం(21.3), ఇంధన ధరలు పెరగడం(26.02)ద్రవ్యోల్భణం(19.06) అని చెప్పారు.ఇక నార్త్ ఇండియా పీపుల్ నిరుద్యోగాన్ని (36.07) మోడీ అతి పెద్ద మిస్టేక్‌గా అభివర్ణించారు. తమిళనాడు ఓటర్లు ధరల పెరుగుదల (41.79) మణిపూర్ హింసాకాండ కూడా ప్రధాని మిస్టేక్ అని 32.89 శాతం మంది, చైనా సరిహిద్దు వివాదం పరిష్కారం కాకపోవడం కూడా మోడీ ప్రభుత్వం తప్పిదమే అని రూ.21.82 శాతం మంది అభిప్రాయాన్ని పంచుకున్నారు.