తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం(Electricity consumption) భారీగా పెరుగుతోంది. గతేడాది మే నెలలో నమోదైన రికార్డు స్థాయి కరెంటు వినియోగం ఈ ఏడాది రెండు నెలలు ముందుగానే అంటే మార్చిలోనే నమోదైంది. ఎండలు మండిపోతుండడం, వరుస సెలవుల కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండడంతో పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మార్చి నెలలో సగటు విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మార్చి వరకు సగటు విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఇది దాదాపు 22.7 శాతం పెరుగుదల. 15 జిల్లాలతో కూడిన టీఎస్ఎస్పీడీసీఎలు పరిశీలిస్తే, 2023 మార్చి 3న 188.60 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 13న గరిష్ట వినియోగం 202.45 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
గతేడాది మార్చి 30న రాష్ట్రంలో 15,497 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 8న 15,623 మెగావాట్లు ఉందంటే విద్యుత్ వినియోగం ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏడాది మార్చి 14న అత్యధికంగా 308.54 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించినట్లు రికార్డుల్లో నమోదైంది. అందులో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్లోనే గృహ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగినట్లు విద్యుత్ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
మే 19న రికార్డు స్థాయిలో 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదైంది. గత గురువారం ఒక్కరోజే గ్రేటర్ లోనే రికార్డు స్థాయిలో 79.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇక మార్చిలో గ్రేటర్ విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే. ఇలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ వినియోగం రికార్డులను తిరగరాస్తోంది. ఇక, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 289.697 మిలియన్ యూనిట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.