Telugu News » VH : నయీం కొల్లగొట్టిన సంపద ఎవరి చేతుల్లోకి వెళ్లింది.. విచారణకు మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్

VH : నయీం కొల్లగొట్టిన సంపద ఎవరి చేతుల్లోకి వెళ్లింది.. విచారణకు మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V.Hanumantha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది.

by Sai
In whose hands the wealth looted by Naeem went.. Former MP VH demanded an inquiry

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V.Hanumantha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో తెలియాలి. గత బీఆర్ఎస్ సర్కారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో అని రాజకీయ నాయకలు, వ్యాపారవేత్తల కాల్స్ రికార్డ్ చేసింది.

In whose hands the wealth looted by Naeem went.. Former MP VH demanded an inquiry

ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలి. ఈ కేసులో అసలు సూత్రదారులెవరో బయటపెట్టాలి. ఇప్పటికే పలువురు అధికారులు అరెస్టు అయ్యారు.దీనివెనుకున్న అందరినీ అరెస్టు చేయాలని వీహెచ్ ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో నయీం(Nayeem) అనే గ్యాంగ్ స్టర్‌(Gangstar)ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అతడు కోట్ల రూపాయలు, విలువైన భూములు కాజేశాడు. నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయి? నాడు సిట్ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారు. ఆ వివరాలను బయటకు వెల్లడించలేదు.
పేదలకు సంబంధించిన భూములను నయీం లాక్కున్నాడు. వాటి విలువ సుమారు రూ.2500 కోట్లకు పైగానే ఉంటుంది.

అప్పట్లో నయీం వెనుక ఎస్పీ శివనంద రెడ్డి ఉండేవాడు.అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళితే తప్పించుకుని పారిపోయాడు. ఎస్పీ, నయీం ఇద్దరు కలిసి కోట్లు కొల్లగొట్టారు. నయీం మరణం తర్వాత ఆ భూములు, డబ్బులు ఏమయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చు.
ఫోన్ ట్యాపింగ్‌ను ప్రభుత్వం ఎలా సీరియస్‌గా తీసుకుందో నయీం పోగెసిన డబ్బులు, అస్తులు ఏమయ్యాయో? ఎవరి చేతుల్లోకి వెళ్లాయో విచారణ జరిపించాలి.

సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశాను. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటు తనకు కేటాయించాలని కోరాను. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో ఖమ్మం జిల్లాలో తిరిగాను.ఖమ్మం టికెట్ నాకిస్తే మెజారిటీ‌తో గెలుస్తాను. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment