బీజేపీ క్యాండిడేట్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఈసారి రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandi) బుధవారం కేరళలోని తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి ఎంపీగా నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేసినట్లు సమాచారం. నామినేషన్‌కు ముందు రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమం సాయంత్రం 4 గంటలలోపు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, తన సోదరి ప్రియాంకగాంధీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పలువురు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు సైతం పాల్గొననున్నారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్ షోలో పాల్గొననున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ ఓడిపోయారు.అక్కడకంచుకోటను చేజార్చుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు, అమేథీ కాంగ్రెస్ కేడర్, బడా నేతలు చెప్పినా రాహుల్ అక్కడి నుంచి పోటీకి సుముఖత వ్యక్తం యలేదు.
రాహుల్ మరోసారి వయనాడ్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. 2019లో రాహుల్ ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 10 లక్షల మంది ఓటర్లు ఉంటే ఏకంగా 7లక్షల వరకు ఓట్లను ఆయన కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా రాహుల్‌కు వయనాడ్ నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడి నుంచే పోటీకి ఓకే చెప్పారు.