మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో(Aurangabad) దారుణం చోటుచేసుకుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం(7 People died) పాలయ్యారు. ఆ సమయంలో వీరంతా నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది. నిద్రలోనే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకివెళితే.. ఔరంగాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఛత్రపతి శంభాజీ నగర్(Shambaji nagar)లో ఈ ఘటన వెలుగుచూసింది. ఉన్నట్టుండి ఓ టైలరింగ్ షాపులో మంటలు చెలరేగాయి.
షాపులోని బట్టలకు మంటలు వ్యాపించడంతో పాటు షాపు పైన ఉండే ఇంటికి కూడా అంటుకున్నాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా పై ఇంటిలో నిద్రిస్తున్న ఏడుగురు ఊపిరి ఆడక మరణించినట్లు తెలుస్తోంది. మృతుత్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.శంభాజీ నగర్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకుని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు.స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం సంభవించిందా? లేదా వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.