Telugu News » IRAN : ఇరాన్‌లో మిలిటెంట్లు, ఆర్మీ మధ్య భీకర కాల్పులు.. 28 మంది మృతి!

IRAN : ఇరాన్‌లో మిలిటెంట్లు, ఆర్మీ మధ్య భీకర కాల్పులు.. 28 మంది మృతి!

ఈ మధ్యకాలంలో మిడిల్ ఈస్ట్‌లో(Middle East) తీవ్ర అశాంతి(Unrest) నెలకొంది. మొన్నటివరకు ఉక్రెయిన్-రష్యా వార్ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం అంచున నిలబడితే ఆ తర్వాత ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం రానున్న భవిష్యత్ గురించి ముందే హెచ్చరించింది.

by Sai
Fierce firing between militants and army in Iran.. 28 dead!

ఈ మధ్యకాలంలో మిడిల్ ఈస్ట్‌లో(Middle East) తీవ్ర అశాంతి(Unrest) నెలకొంది. మొన్నటివరకు ఉక్రెయిన్-రష్యా వార్ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం అంచున నిలబడితే ఆ తర్వాత ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం రానున్న భవిష్యత్ గురించి ముందే హెచ్చరించింది. మొన్నటివరకు ఆఫ్ఘన్-సిరియా వంటి దేశాల్లో నిత్యం కాల్పులు, బ్లాస్టులు, మారణాహోమాలు జరుగుతూ ఉండేవి.మన పొరుగున ఉన్న పాక్‌లో ఆత్మాహుతి దాడులు జరుగుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్‌లో జరిగే యుద్ధాలకు ఇవి సంకేతాలుగా ఘోచరిస్తున్నాయి.

Fierce firing between militants and army in Iran.. 28 dead!

ప్రస్తుతం ఈ దేశాల్లో పరిస్థితి కాస్త కుదుపడగా తాజాగా ఇరాన్(IRAN) దేశంలో మిలిటెంట్లు(Terroist Attack), భద్రతా దళాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ జుల్మ్ సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు.

అదేవిధంగా రాస్క్ కౌంటీలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC)కి చెందిన మిలిటరీ పోస్టుతో పాటు ఐఆర్ జీసీ ప్రధాన కార్యాలయం, చబహార్ కౌంటీలోని కోస్ట్ గార్డ్స్ పోలీస్ స్టేషన్ పై జైష్ అల్ జుల్మ్ గ్రూపునకు చెందిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డాయి.

వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 18 మంది మిలిటెంట్లు, 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా, భారీగా పేలుడు పదార్థాలను మిలిటెంట్లు మోసుకొచ్చినట్లు ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ మహ్మద్ పక్‌‌పూర్ వెల్లడించారు.

You may also like

Leave a Comment