Telugu News » Ipl : నేడు సీఎస్కే VS సన్ రైజర్స్ మ్యాచ్..ఉప్పల్ స్టేడియంలో పవర్ కట్‌కు కారకులు ఎవరు?

Ipl : నేడు సీఎస్కే VS సన్ రైజర్స్ మ్యాచ్..ఉప్పల్ స్టేడియంలో పవర్ కట్‌కు కారకులు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2024) సీజన్‌లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-05)న హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక చెన్నయ్ సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ (CSK-SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అటు చెన్నయ్, ఇటు హైదరాబాద్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

by Sai
CSK VS Sunrisers match today..Who are the factors behind the power cut at Uppal Stadium?

అందుకు గల కారణం ఏమిటంటే.. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు చెన్నయ్ జట్టు కూడా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్నది. అయితే,విన్నింగ్ చాన్సెస్ మాత్రం చెన్నయ్‌కే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చెన్నయ్ ఇప్పటివరకు 3 మ్యాచులు ఆడితే రెండు గెలవగా..సన్ రైజర్స్ 3 మ్యాచులు ఆడితే కేవలం ఒక్కటే గెలిచింది.

హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్ కాస్త పటిష్టంగా మారినా బౌలింగ్‌లో మాత్రం ఇంకా మెరుగవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇదిలాఉండగా గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. రూ.3.4 కోట్ల విద్యుత్ బకాయిల చెల్లించలేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కరెంట్ సరఫరా నిలిపివేసింది.

అయితే, 3 గంటల తర్వాత తిరిగి కరెంట్‌ను పునరుద్ధరించారు. విద్యుత్ అధికారులు బిల్లులు చెల్లించనందునే కరెంట్ తీసేశామని చెబుతుండగా.. హెచ్ సీఏ అధికారులు మాత్రం మరో వాదనను తెరపైకి తెచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌కు పాసులు ఇవ్వలేదని కోపంతో కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. దీంతో ఎవరు చెప్పేది నిజమో తెలియక ప్రజలు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. కాగా, నేటి సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

You may also like

Leave a Comment